విజయవాడ పాత పాయకాపురంలోని వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి జానారెడ్డి నివాసంలో గోమాతకు శీమంతం నిర్వహించారు. నెలలు నిండిన ఆవుకు స్థానికులు, మహిళలు ఈ వేడుక నిర్వహించారు. అర్చకుల ద్వారా వస్త్రాలు, పండ్లు, పూలు పెట్టించి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక మహిళలు స్వయంగా వండి తీసుకువచ్చిన చలివిడి, పిండి పదార్థాలు గోవుకు తినిపించారు.
గోవుకు ఘనంగా శీమంతం నిర్వహణ..! - vijayawada latest news
నెలలు నిండిన ఆవుకు ఘనంగా శీమంతం నిర్వహించారు దాని యజమాని. ఈ ఘటన విజయవాడలో శుక్రవారం జరిగింది.
seemantham performed to a cow