డిపోల నుంచి ఇసుక తరలింపు అనుమతితో ప్రభుత్వంపై భారం తగ్గనుంది. 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉండే లేఅవుట్‌కు జేపీ వెంచర్స్ కంపెనీ ప్రత్యేక వాహనాల్లో ఇసుకను తరలించాలి. ఇందుకుగాను గృహనిర్మాణశాఖ టన్నుకు రూ.175లను సదరు సంస్థకు చెల్లిస్తుంది. 40 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్న డిపో నుంచి జగనన్న కాలనీలకు ఇసుకను తీసుకెళ్లేందుకు గృహనిర్మాణశాఖ అధికారులు కూపన్ జారీ చేస్తారు. ఇసుక ఉచితంగా ఇస్తారు. రవాణా బాధ్యత లబ్ధిదారులదే. ఎక్కడికక్కడ డిపోలు ఏర్పాటు వల్ల లేఅవుట్‌లకు ఉండే దూరం తగ్గనుంది. ఆ మేరకు ప్రభుత్వానికి రవాణా భారం తగ్గుతుంది.
3.47 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా.. పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థల్లో చేపడుతున్న ఇళ్ల నిర్మాణానికి ఇప్పటివరకు జేపీ వెంచర్స్ కంపెనీ 3,47,562 మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేసింది. ఇందులో 40 కిలోమీటర్లు దాటి ఉన్న లేఅవుట్‌లకు 1,18,677 మెట్రిక్ టన్నులు సరఫరా జరిగింది. అంతకంటే తక్కువ దూరంలో ఉన్న లేఅవుట్‌లకు 2,28,885 మెట్రిక్ టన్నులు సరఫరా చేశారు.
ఇసుక కోటా పెంపుపై ప్రత్యేక కమిటీ...