విజయవాడలో సాగర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీని ప్రారంభించారు. రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ,డేటా సైన్స్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆధారంగా సేవలు అందించనున్నట్లు ఆ కంపెనీ సీఈవో సాగర్ తెలిపారు. తమ సంస్థ ద్వారా ఫింగర్ యాక్సెస్ డివైస్‌ను పేటెంట్ చేయించామని...హుండై కంపెనీ వారికి దీనిని టేకాఫ్ చేశామని రితీశ్ తెలిపారు. నగరం కేంద్రంగా రోబోటిక్ హార్ట్ ప్రారంభించామని తెలిపారు. సాఫ్ట్వేర్ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్, పేటీఎం, మకుట విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలకు తమ ప్రాజెక్ట్ ఇచ్చామన్నారు. భవిష్యత్తులో రోబోటిక్స్ లో నూతన ఆవిష్కరణలతో పాటు ప్రభుత్వ ప్రాజెక్టులను సైతం చేసేందుకు తమ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని రితీశ్ పేర్కొన్నారు.
విజయవాడలో మరో సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభం
విజయవాడలో మరో సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రారంభమైంది. సాగర్ పేరుతో ప్రారంభించిన ఈ కంపెనీలో... రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైన్స్ అండ్ డెవలప్ మెంట్ ఆధారంగా సేవలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
'విజయవాడలో ప్రారంభమైన మరో సాఫ్ట్వేర్ కంపెనీ'