సుమారు ఆరు నెలల తరువాత విజయవాడ రహదారులపై సిటీ బస్సులు తిరుగుతున్నాయి. ఇవాళ్టి నుంచి పలు మార్గాల్లో ప్రయోగత్మకంగా బస్సు సర్వీసులను అధికారులు ప్రారంభించారు. నగర పరిధి నుంచి మొత్తం ఆరు మార్గాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్సులు తిరుగనున్నాయి.
కొవిడ్ నిబంధనల మేరకు సీటులో ఒక్కరికే మాత్రమే అనుమతిస్తున్నారు. మాస్క్ ధరించటం తప్పనిసరి చేశారు. బస్సుల్లో నిలబడి ప్రయాణించడాన్ని నిషేధించారు. బస్సుల్లో కనిష్టంగా 5 రూపాయలను ఛార్జీగా నిర్ణయించారు. ప్రస్తుతానికి 26 సిటీ బస్సులు తిప్పేందుకు అనుమతి లభించిందని... తదుపరి ఉత్తర్వుల మేరకు సంఖ్యను పెంచుతామని అధికారులు చెప్పారు. ప్రయోగాత్మక పరిశీలన కోసం మైలవరం, ఆగరిపల్లి, విస్సన్నపేట, పామర్రు, విద్యాధరపురం, మంగళగిరి మార్గాల్లో బస్సులను నడుపుతున్నారు.