ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Gang war: విజయవాడలో 'గ్యాంగ్​వార్​' పండు వీడియో కలకలం

ప్రశాంతంగా ఉన్న విజయవాడ(vijayawada)లో మళ్లీ రౌడీషీటర్లు హల్​చల్​ చేస్తున్నారు. తాజాగా గ్యాంగ్​వార్(Gang war)​ నిందితుడు పండు కత్తులతో ఓ యువకుడిని బెదిరించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ కావడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆ వీడియో ఆధారంగా గ్యాంగ్‌వార్ (Gang war)నిందితుడు పండును పోలీసులు మరోసారి అరెస్ట్​ చేశారు. నేర పందా మార్చుకోని పండు.. మళ్లీ దాడులకు తెగబడుతున్న వీడియో బయటకు రావడంతో చర్యలకు ఉపక్రమించారు.

rowdy sheeter pandu arrested in vijayawda
బెజవాడ గ్యాంగ్​వార్​ నిందితుడు పండు మరోసారి అరెస్ట్​

By

Published : May 31, 2021, 3:42 PM IST

Updated : May 31, 2021, 7:45 PM IST

అనుచరులతో కలిసి కర్రలతో దాడులు చేస్తున్న నిందితుడు పండు..

గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న బెజవాడలో మళ్లీ రౌడీ గ్యాంగులు పేట్రేగి పోతున్నాయి. కరోనా వేళ అంతా అదుపులో ఉన్నట్లే కనిపిస్తున్నా గ్యాంగుల ఆగడాలు షురూ అయ్యాయి. గల్లీల్లో సెటిల్​మెంట్లు చేస్తున్న వారి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో మళ్లీ వైరల్​గా మారాయి. గతంలో కత్తులతో వీరంగం సృష్టించిన నిందితుడు మణికంఠ అలియాస్ కేటీఎం పండు జైలు నుంచి బెయిల్​పై వచ్చీరాగానే తన పాత పందాను కొనసాగిస్తున్నాడు. దుర్గమ్మ చెంతన ప్రశాంతంగా ఉండాల్సిన నగరంలో ఒక్కసారిగా రౌడీల ఆగడాలతో మళ్లీ వార్తల్లో నిలిచింది. పటమట గ్యాంగ్ వార్​(Gang war)లో తోట సందీప్ మృతి తరువాత నగరంలో ఉద్రిక్తతలు కొంత తగ్గినట్లు కనిపించినా.. పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదని తాజా వీడియో ద్వారా తెలుస్తోంది.

విజయవాడలో అసలేం ఏం జరుగుతోంది..?

విజయవాడ గ్యాంగ్‌వార్(Gang war) నిందితుడు పండును పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. గంజాయి అమ్మకాలు, మారణాయుధాలు కలిగి ఉన్నాడనే కేసులో అతడిని అరెస్టు చేశారు. ఐదుగురు అనుచరుల్నీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద మారణాయుధాలు, 15 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గ్యాంగ్ వార్‌(Gang war) కేసులో బెయిల్‌పై బయటికి వచ్చిన పండు.. తీరు మార్చుకోకుండా మళ్లీ కత్తులు, కర్రలతో దాడులు చేస్తూ సెల్ఫీ వీడియోలు తీసుకుని స్నేహితులకు పంపాడు. వాటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : May 31, 2021, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details