ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మున్సిపల్ చట్ట సవరణ బిల్లును వెనక్కు తీసుకోవాలి'

కరోనా ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి విలువ ఆధారిత పన్ను తీసుకురావాలని యత్నించడం సిగ్గుచేటని పట్టణ పౌర సమాఖ్య సభ్యులు అన్నారు. దీనిపై విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

round table meeting
రౌండ్ టేబుల్ సమావేశం

By

Published : Dec 11, 2020, 4:07 PM IST

పట్టణ ప్రజలపై ఇంటి పన్నులు, ఇతర భారాలు మోపే మున్సిపల్ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. పట్టణ పౌర సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

కరోనా ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి విలువ ఆధారిత పన్ను తీసుకురావాలని యత్నించడం సిగ్గుచేటని పట్టణ పౌర సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ చిగురుపాటి బాబూరావు మండిపడ్డారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా, నిరంకుశంగా శాసనసభలో బిల్లును ఆమోదించడం దారుణమన్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నగర ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలను వెనక్కి తీసుకునేదాకా పోరాడతామన్నారు. దీనిపై అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details