విజయవాడలో ప్రైవేటు బస్సుల ఆకస్మిక తనిఖీలు - విజయవాడలో ప్రైవేటు బస్సుల ఆకస్మిక తనిఖీలు న్యూస్
ప్రైవేటు బస్సులను రవాణా అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందుకున్న అధికారులు.. పటమట ఎన్టీఆర్ కూడలి వద్ద నాలుగు బస్సులను సీజ్ చేశారు. హైదరాబాద్, విశాఖ మార్గాల్లో అన్ని టోల్‌గేట్ల వద్ద తనిఖీలు నిర్వహించారు.
కృష్ణా జిల్లాలో రవాణా శాఖ అధికారులు ప్రైవేటు బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సంక్రాంతి పండగను ఆసరాగా తీసుకొని ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ పటమటలోని ఎన్టీఆర్ కూడలి వద్ద తనిఖీలలో 4 బస్సులు సీజ్ చేశారు. జిల్లాలో సుమారు 200పైగా బస్సులను సీజ్ చేసినట్లు తలిపారు. హైదరాబాద్, విశాఖ వెళ్లే మార్గంలోని అన్ని టోల్‌గేట్ల వద్ద తనిఖీలు చేస్తున్నట్లు వెల్లడించారు.