ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అరుదైన శస్త్ర చికిత్సతో.. ప్రాణం పోశారు

విజయవాడ ఆయుష్ ఆసుపత్రి వైద్యులు.. క్లిష్టమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసి.. ఓ మహిళకు ప్రాణాపాయాన్ని తప్పించారు.

rare surgery in vijayawada

By

Published : Jul 18, 2019, 1:34 AM IST

అరుదైన శస్త్ర చికిత్సతో.. ప్రాణం పోశారు

అరుదైన శ్వాసనాళ కణితిని విజయవాడ ఆయుష్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా తొలగించారు. బ్రోంకోస్కోపీ విధానం ద్వారా ఇంటర్​వెన్షనల్ పల్మొనాలోజిస్ట్ డాక్టర్ ఎం.ఎస్ గోపాలకృష్ణ ఈ అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన నాగమ్మ అనే మహిళ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఈనెల 15న ఆయూష్ వైద్యులను సంప్రదించారు. కణితి వల్ల శ్వాసనాళం 80శాతం మూసుకుపోయిందని గమనించిన వైద్యులు సాధారణ శస్త్రచికిత్స సాధ్యం కాని పరిస్థితుల్లో.... బ్రోంకోస్కోపీ విధానాన్ని ఎంచుకున్నారు. విజయవంతంగా చికిత్స పూర్తి చేసి.. బాధితురాలు నాగమ్మను డిశ్చార్జ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details