Special Team for Cheddi gang:రాష్ట్రంలోకి ప్రవేశించిన చెడ్డీ గ్యాంగ్ కదలికలపై పోలీసుల నిఘా పెంచారు. గుజరాత్‌లోని దాహోద్‌లో ఇప్పటికే రెండు బృందాలతో గాలింపు చేపట్టిన విజయవాడ పోలీసులు..మరో బృందాన్ని అక్కడికి పంపించేందుకు సిద్ధమయ్యారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా ప్రస్తుతం నలుగురు అనుమానితులను గుర్తించారు. మరికొందరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
ఒకే అవతారంలో..
విజయవాడ పాలఫ్యాక్టరీ పక్కన ఇటీవల జరిగిన చోరీలో 16 గ్రాముల బంగారం, రూ.లక్ష నగదును దొంగిలించారు. అక్కడున్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తే.. నిక్కర్లు ధరించిన ముగ్గురు వ్యక్తులు ఆయుధాలతో, ముఖానికి ముసుగేసుకుని లోపలకు వెళ్తున్నట్టు కనిపించింది. ఆ తర్వాత గుంటుపల్లిలోని నల్లూరి అపార్ట్మెంట్లో చోరీ జరిగింది. ఇదే అవతారంలో ఉన్న కొందరు అపార్ట్మెంట్ లోపలకు వెళ్లగా.. చప్పుడు కావడంతో వాచ్మెన్ విజిల్స్ వేశాడు. చుట్టుపక్కల వారంతా మేల్కొనడంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ రెండు ఘటనల్లో ఒకే అవతారంలో ఉన్న వ్యక్తులు చోరీలకు దిగారు. మూడు రోజుల క్రితం పోరంకిలోని వసంతనగర్‌లో రెండు ఇళ్లలో చోరీలు జరిగాయి. ముందు రెండు చోరీల్లో ఉన్నవారే పోరంకిలోనూ చోరీకి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు.
శివారు ప్రాంతాలే టార్గెట్..!
cheddi gang cc footage: నగర పరిధిలోని శాటిలైట్ రైల్వే స్టేషన్లను విజయవాడ సీపీ కాంతిరాణా స్వయంగా తనిఖీ చేశారు. శివారు ప్రాంతాల్లోని..రహదారికి సమీపంగా ఉండే ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా తమ పని పూర్తి చేసుకుంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రాంతాలను ఎంపిక చేసుకునేందుకు పగటిపూట ఆటోలు, బస్సుల్లో ప్రయాణించి రెక్కీ చేయడం... రాత్రివేళ చోరీ అనంతరం అక్కడి నుంచి సులువుగా పారిపోవడానికి మార్గాలను చూసుకుంటారని అంచనా వేశారు. శీతాకాలంలో అర్ధరాత్రి సమయంలో బయటకు వచ్చేవారు చాలా తక్కువ ఉంటారని- ఇదే అదనుగా ముఖానికి మంకీ క్యాప్ పెట్టుకుని- నేరాలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్నారు.
ఆ తెగ నేర్పరి..