ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేపటి సభలో.. అదే చేయబోతున్నా : పవన్‌ కళ్యాణ్

సోమవారం జరిగే జనసేన ఆవిర్భావ సభ.. రాష్ట్ర భవిష్యత్‌ రాజకీయాలకు వారధిలాంటిదని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రేపటి ఆవిర్భావ సభ వేదిక నుంచే భవిష్యత్ రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తామని చెప్పారు. సభకు రానీయకుండా ప్రభుత్వం ఇబ్బందులు కలిగిస్తే.. అక్కడకు వెళ్లడం తమ హక్కుగా చెప్పాలని సూచించారు.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/03-February-2022/14365099_pawan.jpg
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/03-February-2022/14365099_pawan.jpg

By

Published : Mar 13, 2022, 3:10 PM IST

Updated : Mar 13, 2022, 3:51 PM IST

రాష్ట్ర భవిష్యత్ కోసం, తెలుగు ప్రజల ఐక్యత కోసం సోమవారం జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఇప్పటంలో జరిగే సభకు వచ్చి విజయవంతం చేయాలని శ్రేణులకు పవన్‌ పిలుపునిచ్చారు. రెండున్నరేళ్లలో ప్రజలు పడిన ఇబ్బందులపై ఈ సభా వేదికగా గళమెత్తుతానని అన్నారు.

భవిష్యత్ ఆశల వారధి జనసేన ఆవిర్భావ సభ

ఈ వేదిక నుంచే భవిష్యత్తు రాజకీయ కార్యచరణపై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తామన్నారు. సభా ప్రాంగణానికి తాను ఎంతగానో అభిమానించే దామోదరం సంజీవయ్య పేరు పెట్టినట్లు తెలిపారు. సభకు రానీయకుండా ప్రభుత్వం ఇబ్బందులు కలిగిస్తే.. సభకు వెళ్లటం మా హక్కు అని చెప్పాలని సూచించారు. ఆవిర్భావ సభ ఏర్పాట్లు చేసిన నాయకులను పవన్ అభినందించారు.

"భవిష్యత్ ఆశల వారధి జనసేన ఆవిర్భావ సభ. తెలుగు ప్రజల ఐక్యత, అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న సభ. రెండున్నరేళ్లలో ప్రజలు పడిన ఇబ్బందులపై గళమెత్తుతా. ఈ వేదిక నుంచే భవిష్యత్‌ రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశం. సభ కోసం పార్టీ శ్రేణులు 10 రోజులుగా కష్టపడ్డారు. సభ ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య పేరు." -పవన్‌ కళ్యాణ్, జనసేన అధినేత

ఇదీ చదవండి

Janasena Serious on Police: విజయవాడలో ఫ్లెక్సీల వివాదం.. జనసేన కార్యకర్తల ఆగ్రహం

Last Updated : Mar 13, 2022, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details