జీవితంలో ఎన్నడూ ఊహించని విపత్తుని ఎదుర్కొంటున్నామని..ఈ కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలవాలనే...బాధ్యతతో జనసేన పనిచేస్తోందని.. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. కృష్ణా, గుంటూరు జిల్లా జనసేన నేతలతో.... టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన..కరోనా వల్ల తలెత్తిన పరిస్థితులు, లాక్‌డౌన్ అమలు,ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షించారు. కరోనా వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు,రాష్ట్రంలో పరిస్థితుల్ని కేంద్ర దృష్టికి తీసుకువెళ్తానని పార్టీ నేతలు, శ్రేణులకు పవన్ వివరించారు.
ప్రజల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: పవన్ - Janasena chief Pawan Kalyan
ప్రజలకు అండగా నిలవాలనే బాధ్యతతోనే జనసేన పనిచేస్తోందని....ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
జనసేన నేతలతో పవన్ టెలీ కాన్ఫరెన్స్