స్ట్రాంగ్ రూంల వద్ద బ్యాలెట్ బాక్సుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈనెల 14 వరకు బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరుస్తామని.., నిరంతరం పర్యవేక్షించడానికి వెబ్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు భద్రతా అంశాల గురించి కొన్ని భయాలు ఉన్నాయని...పార్టీల్లో విశ్వాసాన్ని కలిగించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ తాళాలపై తమ సొంత సీల్ వేసుకునేందుకు రాజకీయ పార్టీలకు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 14న ఉదయం కౌంటింగ్‌కు ముందు రాజకీయ పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లు తెరుస్తామని ఎస్ఈసీ స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూం తాళాలపై సొంత సీల్ వేసుకునేందుకు పార్టీలకు అనుమతి: ఎస్ఈసీ
స్ట్రాంగ్ రూంల వద్ద బ్యాలెట్ బాక్సుల భద్రతపై ఎస్‌ఈసీ ప్రత్యేక దృష్టి సారించింది. స్ట్రాంగ్ రూం తాళాలపై సొంత సీల్ వేసుకునేందుకు రాజకీయ పార్టీలకు అనుమతినిచ్చింది. భద్రతా అంశాలపై పార్టీల్లో కొన్ని భయాలున్నాయని..వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
స్ట్రాంగ్ రూం తాళాలపై సొంత సీల్ వేసుకునేందుకు పార్టీలకు అనుమతి