ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడ నుంచి చెన్నైకి అవయవాల తరలింపు - Organs transport To Chennai

బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను విజయవాడ నుంచి చెన్నైకి ప్రత్యేక విమానంలో తరలించారు. ఈ నేపథ్యంలో మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు.

Organs transport To Chennai
విజయవాడ నుంచి చెన్నైకి అవయవాల తరలింపు

By

Published : Feb 24, 2022, 7:39 PM IST

Organs Transfer To Chennai: గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను ప్రత్యేక గ్రీన్ కారిడార్ ద్వారా చెన్నైకి తరలించారు. గుండె, కాలేయం, ఊపిరితిత్తులను ప్రత్యేక ప్రత్యేక విమానంలో తీసుకెళ్లారు. అవయవాలు కేవలం 22 నిమిషాల్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకునేలా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రి నుంచి విమానాశ్రయం వరకు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మంగళగిరి, విజయవాడ పోలీసుల సమన్వయంతో విమానాశ్రయానికి క్షేమంగా తరలించారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన కోటేశ్వరరావు.. మంగళగిరిలోని ఎన్​ఆర్​ఐ ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు అవయవదానం చేశారు. దీంతో కోటేశ్వరరావు అవయవాలు గన్నవరం విమానాశ్రయానికి తరలించి అక్కడినుంచి చెన్నైకి తీసుకెళ్లారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details