ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈ నెల 18 నుంచి రెండు పూటలా బడులు? - ఈనెల18 నుంచి రెండు పూటలా బడులు

కొవిడ్‌-19 కారణంగా ప్రస్తుతం మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహిస్తున్న తరగతులను ఈ నెల 18 నుంచి రెండు పూటలా నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ భావిస్తోంది. ఇందుకు జిల్లాల వారీగా 100 రోజుల కార్యాచరణను అధికారులు తయారు చేస్తున్నారు.

latest news on schools education
ఈనెల18 నుంచి రెండు పూటలా బడులు

By

Published : Jan 10, 2021, 7:47 AM IST

పాఠశాలల్లో తరగతులను ఈ నెల 18 నుంచి రెండు పూటలా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. కొవిడ్‌-19 కారణంగా ప్రస్తుతం మధ్యాహ్నం 1.30 గంటల వరకే బడి నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే విడివిడిగా తరగతులకు మధ్యాహ్న భోజనాన్ని అందించి పాఠశాలను ముగిస్తున్నారు. ఇక నుంచి కరోనాకు ముందు నిర్వహించినట్లే యథావిధిగా బడులను కొనసాగించాలని ఆలోచిస్తున్నారు.

రాష్ట్రంలో గత నవంబరు 2 నుంచి 9, 10 తరగతులను ప్రారంభించగా.. గత డిసెంబరు 14 నుంచి 7, 8 తరగతులను ప్రారంభించారు. సంక్రాంతి తర్వాత 18 నుంచి ఆరు, ఇంటరు మొదటి ఏడాది తరగతులను ప్రారంభించనున్నారు. పదో తరగతి విద్యార్థులను పబ్లిక్‌ పరీక్షలకు సమాయత్తం చేసేలా బోధన సాగించాలని భావిస్తున్నారు. ఇందుకు జిల్లాల వారీగా 100 రోజుల కార్యాచరణ తయారు చేస్తున్నారు. 1-5 తరగతుల నిర్వహణపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ABOUT THE AUTHOR

...view details