'మంగళవారం మరదలమ్మా' వ్యాఖ్యలపై మంత్రి క్లారిటీ.. 'మంగళవారం మరదలమ్మా' అనే వ్యాఖ్య(niranjan reddy comments on sharmila)పై.. తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి వివరణ ఇచ్చారు. తాను ఎవరి పేరుతోనూ ఆ వ్యాఖ్యలు(niranjan reddy comments on sharmila) చేయలేదని మంత్రి స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలతో ఎవరికైనా బాధ కలిగితే.. విచారం, పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాని తెలిపారు. తన వ్యాఖ్యలు సంస్కారవంతులకు సంస్కారంగానే అర్థమవుతుందన్న మంత్రి.. షర్మిల తన కుమార్తె కంటే పెద్దదని.. సోదరి కంటే చిన్నదని పేర్కొన్నారు.
షర్మిల సమాధానం చెప్పాలి..
" నేను ఎవరి పేరుతో ఆ వ్యాఖ్యలు చేయలేదు. ఏకవచనం వాడలేదు, చివరన అమ్మా అని కూడా అన్నాను. ఎవరికైనా బాధ కలిగితే విచారం, పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా. సంస్కారవంతులకు సంస్కారంగానే అర్థమవుతుంది. షర్మిల నా కుమార్తె కంటే పెద్దది, సోదరి కంటే చిన్నది. తండ్రి సమకాలికుడైన కేసీఆర్‌ను ఏకవచనంతో మాట్లాడటం సంస్కారమేనా?. మా పార్టీ శ్రేణులు తగిన సమయంలో స్పందిస్తాయి. మా మౌనం... సంయమనం, సంస్కారానికి నిదర్శనం. మరి వాళ్ల అన్న పాలిస్తోన్న రాష్ట్రంలో ఓ నాయకుడు చేసిన వ్యాఖ్యలకు షర్మిల సమాధానం చెప్పాలి"
- నిరంజన్‌రెడ్డి, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి
ఇదీ చూడండి: