ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పార్టీల ప్రతినిధులతో సీఈసీ బృందం భేటీ - POLICE

విజయవాడలో భారత ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ ఆరోరా బృందం రెండు రోజులు పాటు పర్యటించనున్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈసీ సమావేశమైంది.

భారత ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ ఆరోర

By

Published : Feb 11, 2019, 10:24 AM IST

Updated : Feb 11, 2019, 2:38 PM IST

భారత ప్రధాన ఎన్నికల అధికారి సునీల్‌ అరోరా బృందం
ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘ బృందం సమావేశమైంది. పార్టీల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది. అనంతరం చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌, పోలీస్‌ నోడల్‌ అధికారులు వీడియో ప్రజంటేషన్‌ ఇస్తారు. సాయంత్రం 3 గంటల నుంచి 6.30 నిమిషాల వరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఐజీలు, ఇతర జిల్లా అధికారులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. రేపు ఉదయం 10 గంటల నుంచి 11వరకు నోడల్‌ అధికారులు, రాష్ట్ర పోలీస్‌, ఇన్‌కంట్యాక్స్‌, కమర్షియల్‌ ట్యాక్స్‌, రైల్వే, ఎయిర్‌పోర్టు అధికారులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. 11.15 నుంచి 12.15 వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం సెక్రటరీలతో సమావేశం అవుతారు. ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల నుంచి సీఈసీ అరోరా వినతుల స్వీకరించారు.

ఎన్నికల్లో రాజ్యాంగ వ్యవస్థలను కేంద్రం తన గుప్పెట్లో పెట్టుకుని నడిపిస్తోందని సీపీఐ నేత వెల్సన్‌ మండిపడ్డారు. ఎన్నికల కమిషన్‌ అలాంటి ప్రలోభాలకు గురికావద్దని సూచించారు. ఓటర్లకు నగదు బదలాయింపులో రాజకీయ పార్టీలు కొత్త పద్ధతులు అనుసరిస్తున్నాయని ఆరోపించారు.

వెల్సన్‌, సీపీఐ నేత


ప్రజాస్వామ్యానికి పునాది లాంటి ఎన్నికల ప్రక్రియను తెలుగుదేశం పార్టీ పెద్ద ఫాల్స్ గా తయారుచేసిందని వైకాపా నాయకుడు పార్థసారథి ఆరోపించారు. తెదేపా గెలుపు కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ, రిగ్గింగ్ చేసి గెలవడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఓటర్ల జాబితాలో తప్పులను గుర్తించి ప్రభుత్వానికి ఇచ్చినా ఇంకా అదే జాబితా కొనసాగిస్తోందని అన్నారు. పేరుకే ప్రభుత్వ సేవల అభిప్రాయాలను యాప్ ద్వారా తెలపాలని అడిగి.. అనంతరం వచ్చిన సమాచారంతో వైకాపా ఓటర్లను గుర్తిస్తున్నారని చెప్పారు. ఓటర్ల జాబితా తయారీని ఉన్నతాధికారులకు కాకుండా.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించి నచ్చినట్లుగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకున్నారని ఆరోపించారు.

పార్థసారథి, వైకాపా నేత

Last Updated : Feb 11, 2019, 2:38 PM IST

ABOUT THE AUTHOR

...view details