రాయలసీమ ఎత్తిపోతల పథకంలో 40 వేల క్యూసెక్కుల సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు మార్చారని తెలంగాణకు చెందిన వ్యక్తి ఎన్జీటీలో పిల్ వేశారు. రోజుకు 8 టీఎంసీల నీరు తరలించేలా పథకాన్ని మార్చారని పిటిషన్లో తెలిపారు. ఏపీ ఇచ్చిన సమాచారంతో కమిటీ లోపభూయిష్టంగా నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మీ వైఖరి చెప్పండి: ఎన్జీటీ - రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వాదనలు న్యూస్
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీలో వాదనలు ముగిశాయి. తెలంగాణకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి వేసిన పిల్‌ను ఎన్జీటీ విచారించింది. పథకంపై కేంద్ర పర్యావరణ శాఖ వైఖరేంటో చెప్పాలని ఎన్జీటీ ఆదేశించింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకం పాతదేనని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రావాల్సిన నీళ్లనే తీసుకుంటున్నామని తెలిపారు. కమిటీ నివేదిక ఏపీకి అనుకూలంగా ఉన్నందున కేసును ముగించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కౌంటర్ అఫిడవిట్ ద్వారా తెలంగాణ వ్యతిరేకించింది. తమ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఇరువైపులా వాదనలు విన్న ఎన్జీటీ.. తమ వైఖరేంటో వారం రోజుల్లో తెలపాలని కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది.