ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నాగార్జునసాగర్​కు కొనసాగుతున్న వరద.. 14 గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్​కు వరద ప్రవాహం కొనసాగుతోంది. రెండున్నర లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా... ఔట్​ఫ్లో సైతం రెండు లక్షల 50 వేలుగా ఉంది. జలాశయం 14 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

nagarjunasagar 14 gates open
నాగార్జునసాగర్​కు కొనసాగుతున్న వరద.. 14 గేట్లు ఎత్తివేత

By

Published : Sep 22, 2020, 5:27 PM IST

శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్​కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్​కు 2లక్షల 50 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా... జలాశయం 14 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తారు. స్పిల్ వే నుంచి 2 లక్షల 9 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం నుంచి ఔట్ ఫ్లో 2లక్షల 50 వేల క్యూసెక్కుల మేర ఉంది.

జలాశయం దిగువన ఉన్న ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 29 వేల క్యూసెక్కుల నీరు పులిచింతల వైపు విడుదల చేస్తున్నారు. సాగర్ కుడి, ఎడమ కాల్వలకు కలిపి సాగు నీరు 12 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుతం 589.20 అడుగులకు చేరింది. 312.04 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 309.65 టీఎంసీలకు చేరింది.

ఇదీ చూడండి:

రఘురామకృష్ణరాజుపై స్పీకర్​కు ఫిర్యాదు చేస్తా: నందిగం సురేశ్

ABOUT THE AUTHOR

...view details