నాటుసారా అమ్మకందారులను సీఎం జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారని జనసేన నేత నాగబాబు ప్రశ్నించారు. జంగారెడ్డి గూడెంలో నాటుసారా కారణంగా ఎవరూ చనిపోలేదని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం వైఖరితో నాటుసారా మాఫియా మరింత విజృంభించే ప్రమాదం ఉందన్న నాగబాబు.. ఇప్పటికైనా సీఎం నిజం ఒప్పుకుని మృతుల కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సీఎం జగన్ అలా చెప్పడం విడ్డూరంగా ఉంది: నాగబాబు - జగన్పై నాగబాబు కామెంట్స్
నాటుసారా కారణంగా ఎవరూ చనిపోలేదని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందని జనసేన నేత నాగబాబు అన్నారు. నాటుసారా అమ్మకందారులను సీఎం జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సీఎం వైఖరితో నాటుసారా మాఫియా మరింత విజృంభించే ప్రమాదం ఉందని ఆయన నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
"నాటుసారా అమ్మకందారులను సీఎం ఎందుకు వెనకేసుకొస్తున్నారు ?. నాటుసారా కారణంగా ఎవరూ చనిపోలేదని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉంది. సీఎం జగన్ వైఖరితో నాటుసారా మాఫియా మరింత విజృంభించే ప్రమాదం ఉంది. సాక్షాత్తూ అసెంబ్లీలోనే సీఎం జగన్ అబద్దాలు చెబుతున్నారు. ఇప్పటికైనా సీఎం నిజం ఒప్పుకుని మృతుల కుటుంబాలను ఆదుకోవాలి. నేను స్వయంగా జంగారెడ్డిగూడెం వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నా." - నాగబాబు, జనసేన నేత
ఇదీ చదవండి: ఆ డబ్బుతోనే... ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు మంచి చేస్తున్నాం: సీఎం జగన్