ప్రశాంతంగా మున్సిపల్ పోలింగ్.. ఇక మిగిలింది ఫలితమే!
16:55 March 10
ప్రశాంతంగా పోలింగ్.. ఇక మిగిలింది ఫలితమే!
చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అన్ని జిల్లాల్లో పట్టణ, నగర ఓటర్లు ఉత్సాహంగా ఓటేయడంతో 62.28 శాతం పోలింగ్ నమోదైంది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 75.93 శాతం, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 55.87శాతం పోలింగ్ జరిగింది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 70.66 శాతం పోలింగ్ నమోదు కాగా.. కార్పొరేషన్లలో 57.14 శాతానికే పరిమితమైంది. కార్పొరేషన్లలో అత్యధికంగా మచిలీపట్నంలో 71.14 శాతం మంది ఓట్లేశారు. కర్నూలులో అత్యల్పంగా 49.26శాతం పోలింగ్ నమోదైంది. కొన్నిచోట్ల ప్రధాన పార్టీల మధ్య వివాదాలు, ఘర్షణలు తలెత్తగా పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.
- విజయనగరం నగరపాలకసంస్థ - 63.98 శాతం
- విశాఖ జీవీఎంసీ - 56.01 శాతం
- ఏలూరు నగరపాలకసంస్థ - 56.33 శాతం
- మచిలీపట్నం నగరపాలకసంస్థ- 71.14 శాతం
- విజయవాడ నగరపాలకసంస్థ - 56.81 శాతం
- గుంటూరు నగరపాలకసంస్థ - 57.15 శాతం
- ఒంగోలు నగరపాలకసంస్థ - 75.52 శాతం
- అనంతపురం నగరపాలకసంస్థ - 56.41 శాతం
- కర్నూలు నగరపాలకసంస్థ - 49.26 శాతం
- కడప నగరపాలకసంస్థ - 54.85 శాతం
- చిత్తూరు నగరపాలకసంస్థ - 66.06 శాతం
- తిరుపతి నగరపాలకసంస్థ - 53.44 శాతం
ఇదీ చదవండి :