ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దిల్లీకి సీఎం ఎందుకెళ్లారు? ఏం చర్చించారు?: రామ్మోహన్​నాయుడు

సీఎం జగన్ తన కేసుల గురించే దిల్లీ వెళ్లారనే అనుమానాలు వస్తున్నాయని ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే తరచుగా దిల్లీ వెళ్తున్నారా? అని ప్రశ్నించారు.

దిల్లీ ఎందుకెళ్లారు? ప్రధానితో ఏం చర్చించారు?: రామ్మోహన్​నాయుడు
దిల్లీ ఎందుకెళ్లారు? ప్రధానితో ఏం చర్చించారు?: రామ్మోహన్​నాయుడు

By

Published : Oct 7, 2020, 3:48 PM IST

Updated : Oct 7, 2020, 4:28 PM IST

ప్రధాని నరేంద్రమోదీతో 40నిమిషాల పాటు భేటీ అయిన ముఖ్యమంత్రి జగన్ ఏం మాట్లాడకుండా తోకముడిచి వెనుతిరగటం లాలూచీ కాక మరేంటని ఎంపీ రామ్మోహన్ నాయుడు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానిని కలిశానని ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు. 11 సీబీఐ కేసులున్నందున లాలూచీ కోసమే ప్రధానితో భేటీ అయినట్లు స్పష్టమవుతోందని విమర్శించారు.

18 నెలలుగా కేంద్రంపై జగన్ చేసిన పోరాటమేంటో చెప్పాలి. ప్రత్యేక హోదా ఎప్పుడు తెస్తారు. విభజన హామీల సాధనంటేనే భయపడి పారిపోయే పరిస్థితి ఎందుకొచ్చిందో సమాధానం చెప్పాలి. 22 మంది ఎంపీలు ఉండి పార్లమెంట్​లో 4వ అతిపెద్ద పార్టీగా వైకాపా ఉంది. చంద్రబాబుపై చేసే నిరాధార ఆరోపణలకు సీబీఐ విచారణ కోరుతూ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. విభజన హామీలపై ఒక్కరోజు కూడా ఎందుకు ఆందోళన చేయలేదు. 151మంది ఎమ్మెల్యేలు గెలిచినంత మాత్రాన తానే రాజ్యాంగం అని జగన్ భావించటం తగదు.

- రామ్మోహన్ నాయుడు

ఇందుకేనా ముఖ్యమంత్రి పదవి

'అక్రమ కేసులు పెట్టేందుకు, దిల్లీలో ప్రధాని అపాయింట్​మెంట్లు తీసుకునేందుకే మీకు ముఖ్యమంత్రి పదవా? ఒక్క ఛాన్స్ అని అడిగింది వీటి కోసమేనా? క్రమశిక్షణ లేని ఆర్థిక పాలనతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. ఇప్పుడు ఎన్డీఏలో చేరితే ఎవరికి ఏ మంత్రి పదవి వస్తుందో అనే ఉత్సాహంలో ఎంపీలు ఉన్నారు. బూతులు తిట్టడం, తెదేపాపై నిందల మోపటానికి సమయం వృథా చేసుకుంటున్నారు. జగన్ చర్యల వల్ల రాష్ట్రం ఎంతో భ్రష్టుపట్టింది. ప్రత్యేక హోదా, ఇతర విభజన హామీలు ఎప్పటి లోగా సాధిస్తారో జగన్ సమాధానం చెప్పాలి' అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

వైకాపాకు మా మద్దతు ఉంటుంది

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం పోరాటం చేసినా తెలుగుదేశం మద్దతు ఉంటుందని రామ్మోహన్ నాయుుడ స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంతో అవసరమని.. పెండింగ్ లో ఉన్న జీఎస్టీ నిధులతో పాటు అన్నీ సాధించాలని సూచించారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక పోలవరం ఆలస్యమవుతోందని కేంద్ర జల్​శక్తి మంత్రి ప్రకటన స్పష్టం చేస్తోందన్నారు. ప్రత్యేక హోదా కోసం అడుగుతూనే ఉంటామని చెప్పటానికి ప్రజలు ఓట్లు వేయలేదని గ్రహించాలని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఉత్తరాంధ్రపై కపట ప్రేమ చూపే వాళ్లు రైల్వే జోన్ కోసం ఎందుకు ఎంపీలతో మాట్లాడించట్లేదని నిలదీశారు.

ఇదీ చదవండి:

'జీనోమ్​ ఎడిటింగ్'​ పరిశోధకులకు నోబెల్​

Last Updated : Oct 7, 2020, 4:28 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details