ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"మోదీ పంపితేనే.. జగన్ పంచుతున్నారు" - ycp

ముఖ్యమంత్రి జగన్‌ నొక్కే బటన్‌కు బ్యాటరీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమని..భాజపా ఎంపీ GVL నరసింహారావు అన్నారు. కేంద్రం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు పంపిణీ చేయాలంటూ.. ఈనెల 14న కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తామని ఆయన ప్రకటించారు. జగన్‌ను వైకాపా శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పని విమర్శించారు.

GVL on CM Jagan
GVL on CM Jagan

By

Published : Jul 11, 2022, 3:56 PM IST

Updated : Jul 11, 2022, 4:01 PM IST


కేంద్ర ప్రభుత్వం రేషన్‌ కోటా పంపించినా.. దాన్ని ప్రజలకు అందించకుండా.. ఆ నెపాన్ని ప్రధాని మోదీపై నెట్టడం దుర్మార్గమని భాజపా ఎంపీ జీవీఎల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ విషయంలో చేస్తున్న మోసాలపై భాజపా ఉద్యమిస్తుందని అన్నారు. ఈనెల 14న అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల వద్ద ధర్నా చేస్తామని చెప్సారు. పేదలకు బియ్యం ఎగ్గొట్టి ప్లీనరీల పేరుతో సంబరాలు చేసుకున్నారని జీవీఎల్ ధ్వజమెత్తారు.

వైకాపా ప్లీనరీలో పార్టీకి శాశ్వత అధ్యక్షున్ని ఎన్నుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పుగా అభివర్ణించిన జీవీఎల్‌.. ఒకే కుటుంబం నుంచి పార్టీని శాసించే విధానాన్నిఆపాలన్నారు. బటన్‌ నొక్కి నేరుగా డబ్బులు పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి గొప్పగా చెప్పుకొంటున్నారని.. కానీ ఆ డబ్బులను మోదీయే పంపిస్తున్నారనే విషయాన్ని జగన్‌ ఎక్కడా చెప్పడం లేదని తెలిపారు.

ఇవీ చూడండి :

Last Updated : Jul 11, 2022, 4:01 PM IST

ABOUT THE AUTHOR

...view details