ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

mlc madhav fires on ysrcp govt: సినీ పరిశ్రమపై ప్రభుత్వ కక్ష సరికాదు: ఎమ్మెల్సీ మాధవ్ - mlc madhav latest news

mlc madhav fires on ysrcp govt: సినీ పరిశ్రమపై రాష్ట్రప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని.. ఎమ్మెల్సీ మాధవ్ మండిపడ్డారు. సినిమా థియేటర్ల తనిఖీల విషయంలో.. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదనేది స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

mlc madhav fires on ysrcp govt is biased against the film industry
సినీ పరిశ్రమపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదు: ఎమ్మెల్సీ మాధవ్

By

Published : Dec 25, 2021, 10:48 PM IST

mlc madhav fires on ysrcp govt: కరోనా కారణంగా.. రెండేళ్లుగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఈ దశలో రాష్ట్రప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని మండి పడ్డారు. సినిమా థియేటర్ల తనిఖీల విషయంలో.. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదనేది స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,100 సినిమా థియటర్లు ఉండగా.. అందులో 300లకు పైగా మల్టిప్లెక్స్​లు ఉంటే.. వాటి జోలికి అధికారులు వెళ్లకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.

టిక్కెట్ ధరల విషయంలో.. ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం సహేతుకంగా లేదన్నారు. టిక్కెట్ ధరలు నిర్ణయించడంలో.. అఖిలపక్షంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆదాయం పెంచుకోవడానికి మార్గాలు ఇవి కావు. ఇతర రాష్ట్రాల్లో సినీపరిశ్రమను ప్రోత్సహిస్తున్న విషయం గమనించాలి. సినీ పరిశ్రమపై వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. -మాధవ్, ఎమ్మెల్సీ

ఇదీ చదవండి:

Yanamala on State Finance: 'రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అథఃపాతాళానికి నెట్టారు'

ABOUT THE AUTHOR

...view details