ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్‌ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలో అడుగడుగునా తడబాటు - జగన్ ప్రసంగం

స్వేద్యం, ఆర్థిక స్వాలంబన, అభ్యుద్వయం, ఉటకించారు, సామాజిక అభ్రదత, మహానుయోధులు, వజ్జోత్సవాలు ఈ పదాలను చదువుతుంటే... ఏంటీ ? అన్నీ తప్పులతడకగా ఉన్నాయే ! అని అనిపిస్తోందా? స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం జగన్‌ ప్రసంగంలో దొర్లిన పొరపాట్లలో ఇవి కొన్ని మాత్రమే. దాదాపు 45 నిమిషాలపాటు ప్రసంగించిన ఆయన పలుమార్లు తడబాటుకు గురయ్యారు. కొన్ని పదాలు సరిగ్గా పలకలేకపోయారు. ఇరవైకి పైగా పదాలు పలకడంలో తప్పులు దొర్లాయి. మరికొన్ని పదాలు చదవడంలో తడబడి ఆ తర్వాత సరిదిద్దుకున్నారు.

ప్రసంగంలో అడుగడుగునా తడబాటు
ప్రసంగంలో అడుగడుగునా తడబాటు

By

Published : Aug 16, 2022, 4:49 AM IST

  • ‘మహాయోధుల త్యాగాల’తో అనటానికి బదులు ‘మహానుయోధుల త్యాగాలతో’ అని అన్నారు. ‘స్వాతంత్య్ర వజ్రోత్సవాలు’కు బదులు ‘స్వాతంత్య్ర వజ్జోత్సవాలు’ అని చదివారు. ‘ఆర్థిక స్వావలంబనకు చేయూత ఇస్తున్నాం’ బదులు ‘ఆర్థిక స్వాలంబనకు చేయూత ఇస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు.
  • ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు’ అని అనాల్సిన చోట ‘సుస్థిరాభివృద్ధి లక్షణాలు’ అని అన్నారు. ఇవి మాత్రమే కాదు.. ‘ఉటంకించారు’ అనే పదాన్ని ‘ఉటకించారు’ అని, ‘స్వేదం’ అనే పదాన్ని ‘స్వేద్వం’ అని.. ‘విప్లవాత్మక’ అనే పదాన్ని ‘విప్లవాత్మిక’ అని పలికారు.
  • అభ్యుదయాన్ని ‘అభ్యుద్వయం’గా చదివారు. నియామకం అని అనాల్సిన చోట తొలుత ‘నియాకం’ అని పేర్కొని మళ్లీ సరిదిద్దుకుని ‘నియామకం’ అని చదివారు. ‘సామాజిక అభద్రత’ అనడానికి బదులుగా ‘సామాజిక అభ్ర’ అని చదివి.. తర్వాత సరిదిద్దుకున్నారు.
  • ‘ప్రతి పథకం’ అనేదాన్ని ‘ప్రతి ప్రతకం’ అని చదివారు. ‘ధర్మాల సమ్మేళనం’ అని అనాల్సిన చోట ‘ధర్మేలా సమ్మేళన’ అని పలికారు.
  • ‘ఆర్థికంగా’ అని అనాల్సిన చోట ‘హార్థికంగా’ అని అన్నారు. ‘గోధుమ’ను ‘గోదము’ అని అన్నారు. ‘చదవక తప్పని పరిస్థితి’ అని అనాల్సిన చోట తడబడి ‘చదవ’ అని ఆపి మళ్లీ సరిదిద్దుకుని ‘చదవక తప్పని పరిస్థితి’ అని అన్నారు.
  • ‘ఆవిర్భవించాలి’ అనే పదాన్ని ‘ఆవిర్భించాలి’ అని చదివారు. ‘కార్పొరేట్‌ విద్యాసంస్థలు’ అనే పదాన్ని ‘కార్పొరేట్‌ విద్య సంస్థలు’గా పలికారు. ఇలా జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ఆద్యంతం తడబాట్లుతోనే కొనసాగింది.

అంతా ‘జగనన్న’ నామస్మరణ

  • స్వాతంత్య్ర దినోత్సవాల్లో అంతా ‘జగనన్న’ నామస్మరణే జరిగింది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి శకటాల ప్రదర్శన సందర్భంలో జరిగిన నేపథ్య వ్యాఖ్యానమంతా పదేపదే ‘జగనన్న ప్రభుత్వం’ అనే పదంతోనే కొనసాగింది.
  • ‘మనుషులకే కాదు... పశువుల ఆరోగ్యానికి సైతం భద్రత, భరోసా కల్పిస్తోంది. మంచి మనసున్న మన జగనన్న ప్రభుత్వం’ అంటూ పశు సంవర్ధక శాఖ శకటం వచ్చిన సందర్భంగా వ్యాఖ్యానించారు.
  • ‘అమ్మఒడి నుంచి ప్రభుత్వ బడి దాకా... వినూత్న విద్యా పథకాలు.. బడిపిల్లలకు వరాలు... జగనన్న ప్రభుత్వం అమలు చేస్తున్న పలు వినూత్న పథకాలు... బడి ఈడు పిల్లలకు వరాలుగా మారాయి’ అని విద్యాశాఖ శకటం వచ్చిన సందర్భంగా ప్రస్తావించారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details