ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొచ్చి... ప్రతి ఒక్కరినీ చదివించాలనే లక్ష్యంతో రాజన్న బడిబాట కార్యక్రమం చేపట్టామని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలోని బిషప్ అజరయ్య బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన రాజన్న బడిబాట కార్యక్రమానికి హాజరయ్యారు. విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించారు. గతంలో మధ్యాహ్న భోజన పథకాన్ని నామమాత్రంగా నిర్వహించారన్న మంత్రి... ఫలితంగా ఎంతో మంది విద్యార్థులు భోజనం కోసం ఇళ్లకు వెళ్లేవారని గుర్తుచేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు తలెత్తకుండా పరిశుభ్ర వాతారవణంలో ఇంటి తరహా భోజనం అందిస్తున్నామని వెల్లంపల్లి పేర్కొన్నారు.
రాజన్న బడిబాటతో అందరికీ చదువు: వెల్లంపల్లి - cm jagan
ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకే... రాజన్న బడిబాట కార్యక్రమం చేపట్టామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏటేటా విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు.
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు