ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏడాదికి ఒకసారైనా సీఎంతో భేటీకి ప్రయత్నిస్తా: మంత్రి విశ్వరూప్

రాష్ట్రంలో లారీ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ కోరింది. ఇతర రాష్ట్రాల కన్నా రాష్ట్రంలో డీజిల్‌ రేట్లు, జరిమానాలు ఎక్కువగా ఉండటం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామన్న లారీ యజమానులు.. డీజిల్​పై పన్నులు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారం కోసం సీఎంతో అపాయింట్‌మెంట్‌ కోసం మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నా.. ఇవ్వలేదని అసోసియేషన్‌ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే.. త్వరలోనే ఇప్పిస్తానని మంత్రి విశ్వరూప్‌ వారికి హామీ ఇచ్చారు.

మంత్రి విశ్వరూప్
మంత్రి విశ్వరూప్

By

Published : May 3, 2022, 9:11 PM IST

Updated : May 4, 2022, 4:28 AM IST

రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విశ్వరూప్‌, ఆ శాఖ మాజీ మంత్రి పేర్ని నానిని.. ఆంధ్రప్రదేశ్‌ లారీ ఒనర్స్‌ అసోషియేషన్‌ నేతృత్వంలో ఘనంగా సన్మానించారు. విజయవాడలోని లారీ ఓనర్స్‌ అసోషియేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా లారీ యజమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లారీ యజమానులు పడుతోన్న కష్టాలపై మంత్రికి మెమోరాండం సమర్పించి సత్వరమే పరిష్కరించాలని కోరారు. డీజిల్‌ రేట్లు తగ్గింపు, ఏపీ, తెలంగాణ మధ్య కౌంటర్‌ సిగ్నేచర్‌ పర్మిట్ల జారీకి విన్నవించారు.

ఏపీ, తెలంగాణ మధ్య కౌంటర్‌ సిగ్నేచర్‌ పర్మిట్‌ కోసం తాను ఎన్నోసార్లు తీవ్ర ప్రయత్నం చేశానని మాజీ మంత్రి పేర్నినాని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం,అధికారుల నుంచి కనీస స్పందన లేకపోవడంతోనే ప్రక్రియ ముందుకెళ్లలేదన్నారు. పర్మిట్ల కోసం ఇకపైనా ప్రయత్నించాలని మంత్రి విశ్వరూప్‌ను కోరుతున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం మూడేళ్లుగా సీఎం అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నా ఇవ్వలేదని లారీ యజమానులు తనతో అన్నారన్న మంత్రి విశ్వరూప్‌.. కొవిడ్‌ కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో సీఎం బిజీగా ఉండటమే అందుకు కారణమన్నారు. కనీసం 6 నెలలకోసారి అధికారుల సమావేశం, ఏడాదికోసారి సీఎంతో భేటీని ఏర్పాటు చేయిస్తానని మంత్రి విశ్వరూప్​ హామీ ఇచ్చారు.

కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. తెలంగాణ, ఏపీ మధ్య కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు ఇవ్వాలి. ఆర్టీఏ అధికారులు ఇష్టారీతిన లారీలపై కేసులు రాస్తున్నారు. లారీలపై గ్రీన్‌ట్యాక్స్ రూ.20 వేలకు పెంపుతో ఇబ్బందులు. వైఎస్‌ఆర్‌ హయాంలో 17సార్లు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. జగన్ అపాయింట్‌మెంట్ కోసం మూడేళ్లుగా యత్నిస్తున్నా ఇవ్వలేదు. -లారీ యజమానులు

ఇదీ చదవండి:సిమ్​కార్డు రాకెట్ గుట్టు రట్టు.. లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా పేరుతో చీటింగ్​

Last Updated : May 4, 2022, 4:28 AM IST

ABOUT THE AUTHOR

...view details