రెండో విడత రేషన్ సరకుల పంపిణీ విజయవాడ తూర్పులో ప్రారంభించామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. మూడు విడతలుగా రేషన్ ఇస్తామని సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారన్నారు. రెండో విడత రేషన్ ఈనెల 27వరకు అందించనున్నట్లు తెలిపారు. పేదలకు ఇప్పటికే వెయ్యి రూపాయలు అందజేశామన్నారు. తాము మంచి కార్యక్రమాలు చేస్తుంటే చంద్రబాబు నీచ రాజకీయం చేస్తున్నారని వెల్లంపల్లి విమర్శించారు. పక్క రాష్ట్రంలో కూర్చుని లేఖలు రాస్తూ శవ రాజకీయం చేయడం చంద్రబాబుకే దక్కిందని మండిపడ్డారు. రేషన్ పంపిణీ ప్రారంభించడం ఆనందంగా ఉందని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైకాపా ఇన్ ఛార్జి దేవినేని అవినాష్ తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పంపిణీ చేస్తామన్నారు. తెదేపా నాయకులు నీచ రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు.
రెండో విడత రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం - ఏపీలో రేషన్ డిస్టిబ్యూషన్ న్యూస్
రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత రేషన్ బియ్యం పంపిణీని విజయవాడ రామలింగేశ్వరనగర్‌లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, దేవినేని అవినాష్, జెసీ మాధవీలత ప్రారంభించారు. ముందు రెడ్ జోన్ ప్రాంతాల్లో ఇంటికే రేషన్ సరకులు పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు.
minister vellampalli start ration distributionminister vellampalli start ration distribution