విజయవాడ రైతు శిక్షణ కేంద్రంలో మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన జిల్లా సమీక్ష మండలి సమావేశం జరిగింది. కృష్ణా జిల్లాలోని జగనన్న కాలనీల్లో గృహనిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. అధికారులు గృహనిర్మాణంపై శ్రద్ధ చూపాలని.. లబ్ధిదారులను ప్రోత్సహించాలని అన్నారు. గృహనిర్మాణాల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో ఇంకా పంట నష్టపరిహారం అందని రైతులను గుర్తించి వారికి పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో జిల్లాలోని ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని మంత్రి సూచించారు. జిల్లాలో న్యూమొకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ అందజేతను మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభించారు. కరోనా మూడో దశకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్ జె. నివాస్ తెలిపారు. జిల్లాలో 6,264 పడకలను పెంచామన్న కలెక్టర్.. 3,551 డీ- టైపు సిలెండర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.