ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రూ.55 వేల కోట్ల పన్ను వసూళ్లే లక్ష్యం' - tax paying

పన్నుల వసూళ్లలో అవకతవకలు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి దిశానిర్దేశం చేశారు. పన్ను వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ గురించి త్వరలోనే ముఖ్యమంత్రి జగన్‌ మోహనరెడ్డితో మాట్లాడతామని తెలిపారు.

నారాయణ స్వామి

By

Published : Sep 7, 2019, 6:19 PM IST

Updated : Sep 7, 2019, 7:36 PM IST

మీడియాతో మంత్రి నారాయణ స్వామి

వేధింపులకు తావు లేకుండా సక్రమంగా పన్ను మొత్తాలను రాబట్టాలని రాష్ట్ర వాణిజ్యపన్నులు, అబ్కారీ శాఖ మంత్రి కె.నారాయణస్వామి అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల వాణిజ్య పన్నులశాఖ అధికారులతో విజయవాడ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వ్యాపారవేత్తలు, సంస్థలు పన్నుల రూపంలో చెల్లించాల్సిన మొత్తానికి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ గురించి త్వరలోనే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్​రెడ్డితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం 55 వేల కోట్ల రూపాయల వరకు పన్నుల రూపంలో వసూలు కావాల్సి ఉన్నప్పటికీ... సాధారణ ఎన్నికల కారణంగా వసూళ్లు తగ్గాయని తెలిపారు. కానీ గత నెలతో పోలిస్తే ఈ నెలలో వసూళ్లు పెరిగాయని... త్వరలోనే లక్ష్యాన్నిచేరుకోగలమనే విశ్వాసం ఉందన్నారు. బోగస్‌ పర్మిట్లు, తప్పుడు ధ్రువపత్రాలతో పన్నుల ఎగవేత వంటి వ్యవహారాలకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. న్యాయపరమైన కేసుల కారణంగా ఐదు వేల కోట్ల రూపాయల వరకు పన్ను బకాయిలు ఉన్నాయని... ఈ మొత్తాన్ని రాబట్టేందుకు న్యాయనిపుణులతో చర్చిస్తున్నామన్నారు. విశాఖపట్నం, విజయవాడ-2, ఏలూరు, కర్నూలు వాణిజ్యపన్నుల శాఖ సర్కిళ్లు 91 శాతం లక్ష్యాలను చేరుకుంటున్నాయని పేర్కొన్నారు. కడప, విజయవాడ-1, గుంటూరు సర్కిళ్లు వెనుకంజలో ఉన్నాయని చెప్పారు. అన్ని సర్కిళ్ల పరిధిలోనూ సక్రమంగా పన్ను వసూలు జరిగేలా ఆదేశించామన్నారు.

Last Updated : Sep 7, 2019, 7:36 PM IST

ABOUT THE AUTHOR

...view details