ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మోదీ కనుసన్నల్లోనే ఈసీ నడుస్తోంది..! - ELECTION COMMISON

మోదీ కనుసన్నల్లోనే ఎన్నికల సంఘం పనిచేస్తోందని మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. వేమూరు నియోజకవర్గంలో  విశ్రాంత అధికారి ఎన్నికల కమిషన్ విధులు నిర్వహించటంపై, జిల్లా ఎన్నికల అధికారి కోన శశిధర్​కు ​ఫిర్యాదు చేశారు.

మంత్రి నక్కా ఆనందబాబు

By

Published : Apr 30, 2019, 5:44 PM IST

మంత్రి నక్కా ఆనందబాబు

ప్రధాని మోదీ కనుసన్నల్లోనే ఎన్నికల సంఘం పనిచేస్తోందని మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. వేమూరు నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ విధులను ఓ విశ్రాంత అధికారి నిర్వహించటంపై జిల్లా ఎన్నికల అధికారి కోన శశిధర్​కు ఫిర్యాదు చేశారు. విశ్రాంత అధికారికి ఎన్నికల విధులు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఏపీలో ఎన్నికల కమిషన్​ వ్వవహరించిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. 3 దఫాలుగా తాను ఎన్నికల్లో పాల్గొంటున్నా.. ఎప్పుడూ ఇంత దారుణమైన పరిస్థితిలో ఎన్నికలు జరగలేదని ఆవేదన చెందారు. షెడ్యూల్ రాకముందే శ్రీకాకుళంలో కలెక్టర్​ను మార్చటం, ఎన్నికలకు సంబంధం లేని అధికారులను మార్చటం ఇలా రాష్ట్రంలో జరిగిన ప్రతీది మోదీ కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఓట్లు లేకున్నా... జగన్​ను అధికారంలోకి తెచ్చేందుకు భాజపా నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details