ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దేశానికి నిజమైన హీరోలు మీరే: కేటీఆర్​

వైద్య సిబ్బంది పనితీరుపై తెలంగాణ మంత్రి కేటీఆర్​ ప్రశంసల జల్లు కురిపించారు. వైరస్ సోకి ప్రాణాలతో పోరాడుతున్న వారికి ఊపిరి పోసి దేశానికి నిజమైన హీరోలు అనిపించుకుంటున్నారని ప్రశంసిస్తూ ఓ వీడియోను జతచేశారు.

By

Published : May 3, 2020, 8:09 AM IST

minister-ktr-shown-gratitude-on-medical-staff-
వైద్యులకు కేటీఆర్​ సంఘీభావం

వైద్యులకు కేటీఆర్​ సంఘీభావం

కరోనాపై పోరులో విశేష కృషిచేస్తోన్న వైద్య సిబ్బందిని సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా వారి సేవలకు సంఘీభావం ప్రకటించారు.

ప్రాణాలకు తెగించి కొవిడ్-19 బాధితుల చికిత్స అందిస్తోన్న మెడికల్, పారామెడికల్ వైద్య సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ కేటీఆర్​ ట్వీట్​ చేశారు. వైరస్ సోకి ప్రాణాలతో పోరాడుతున్న వారికి ఊపిరి పోసి దేశ నిజమైన హీరోలు అనిపించుకుంటున్నారని ప్రశంసిస్తూ ఓ వీడియోను జతచేశారు. కాగా వైద్యసిబ్బంది సేవలకు గౌరవ ప్రదంగా ఆదివారం ఉదయం గాంధీ ఆస్పత్రిపై భారత వాయుసేవ దళాలు పూలవర్షం కురిపించనున్నాయి.

ఇవీచూడండి:

ఎలుక తెచ్చిన తంట.. జైలుకెళ్లిన వ్యక్తి!

ABOUT THE AUTHOR

...view details