ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్రం నుంచి నిధులు రాకపోయినా.. రైతులకు చెల్లించాం: కొడాలి - చంద్రబాబుపై కొడాలి నాని కామెంట్స్

రబీ సీజన్​లో రైతులకు రూ.1637 కోట్లు చెల్లింపులు చేశామని మంత్రి కొడాలి నాని అన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి గడువులోగా చెల్లిస్తామని తెలిపారు.

minister kodali nani
minister kodali nani

By

Published : Jun 19, 2021, 2:55 PM IST

రబీ సీజన్​లో కేంద్రం నుంచి నిధులు రాకపోయినా ఇప్పటివరకూ రైతులకు రూ.1,637 కోట్లు చెల్లించామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి 21 రోజుల గడువులోగా చెల్లింపులు చేస్తామని రైతులకు చెప్పామని వెల్లడించారు. కేంద్రం నుంచి రూ.3,229 కోట్ల మేర నిధులు రావాల్సి ఉందన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో 4 వేల కోట్ల ధాన్యం కొనుగోళ్ల మొత్తంతో పాటు రూ.996 కోట్ల రూపాయల బకాయిలు కూడా వైకాపా ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. ప్రస్తుతం రబీ సీజన్​లో 40 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించే అవకాశముందని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే 5-6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతులు బయట విక్రయించుకున్నారని స్పష్టం చేశారు.

రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంటే.. చంద్రబాబు, నారా లోకేశ్​లు లేనిపోని రాజకీయం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. తెదేపా హయాంలో కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు హత్యకు గురయ్యారని వాటన్నిటికీ చంద్రబాబు బాధ్యత వహిస్తారా? అని మంత్రి ప్రశ్నించారు. గ్రామస్థాయిలో జరిగిన ప్రతీ అంశాన్నీ ముఖ్యమంత్రికి ఆపాదించటం సరికాదన్నారు. తెదేపా నేతలు ముఖ్యమంత్రి జగన్​ను ఏకవచనంతో సంబోధిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది తెదేపా నేతల పిల్లలకు కూడా గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు వచ్చాయన్నారు. కొవిడ్ కేసులను పొరుగు రాష్ట్రాల్లో దాచిపెడుతున్నారని.. ఏపీలో అన్నింటినీ పారదర్శకంగానే వెల్లడిస్తున్నామన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గుర్తిస్తున్నారని కొడాలి తెలిపారు.

ఇదీ చదవండి:పంథా మార్చిన సైబర్ క్రైమ్స్​- ఇలా జాగ్రత్తపడండి..

ABOUT THE AUTHOR

...view details