ఈ నెల 18 నుంచి రాయితీ విత్తనాలు విక్రయించనున్నట్టు మంత్రి కన్నబాబు వెల్లడించారు. ఆర్థిక కష్టాలున్నా రైతుల ఖాతాల్లో రూ.2800 కోట్లు వేశామని గుర్తు చేశారు. రైతు భరోసాలో కోత విధించామంటున్న చంద్రబాబు..అన్నదాత సుఖీభవ పథకాన్నిసరిగ్గా అమలు చేయలేదని విమర్శించారు.
18 నుంచి రాయితీ విత్తనాల విక్రయం: కన్నబాబు
గ్రామస్థాయిలోనే రైతులకు విత్తనాలు సరఫరా చేయనున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. వేరుశనగ విత్తనాలను గతంలో కంటే లక్ష క్వింటాళ్లు అధికంగా ఇస్తున్నామన్నారు.
minister kanna babu about subsidy seeds