ఈ రాష్ట్రాన్ని ఎలా ఉద్ధరిస్తారో జనసేన అధినేత పవన్ చెప్పలేకపోయారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏం చేస్తారో స్పష్టంగా చెబితే ప్రజలు జనసేన గురించి ఆలోచిస్తారన్నారు. సినిమా డైలాగులు వినేందుకు చాలా బాగుంటాయన్న ఆయన.. రౌడీలు, గూండాలు వంటి పదాలు సినిమాల్లో వాడితే మంచిదన్నారు. ఏ వైకాపా నాయకుడు రౌడీయిజం చేశారో చెప్పాలని పవన్‌ను నిలదీశారు.
జనసేన ఆవిర్భావ సభలో ఉపన్యాసం ఇచ్చిన పవన్.. ప్రజలకు పనికివచ్చే అంశం ఒక్కదానిపైనా మాట్లాడలేదన్నారు. వైకాపాను ఎందుకు గద్దె దించాలో పవన్ చెప్పలేకపోయారని ఆక్షేపించారు. తనకు రోడ్‌మ్యాప్, ఆలోచన, అవగాహన లేదని.. పవన్ నిజం ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు.
"ఈ రాష్ట్రాన్ని ఎలా ఉద్ధరిస్తారో పవన్ చెప్పలేకపోయారు ఏం చేస్తారో స్పష్టంగా చెబితే ప్రజలు జనసేన గురించి ఆలోచిస్తారు. సినిమా డైలాగులు వినేందుకు చాలా బాగుంటాయి. ప్రజలకు పనికివచ్చే అంశం ఒక్కటీ పవన్ ఉపన్యాసంలో లేదు. వైకాపాను ఎందుకు గద్దె దించాలో పవన్ చెప్పలేకపోయారు. ఏ వైకాపా నాయకుడు రౌడీయిజం చేశారో చెప్పాలి. రౌడీలు, గూండాలు.. పదాలు సినిమాల్లో బాగుంటాయి. తనకు రోడ్‌మ్యాప్, ఆలోచన, అవగాహన లేదని పవన్ నిజం చెప్పారు."- బొత్స సత్యనారాయణ, మంత్రి