ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Free Electricity:వచ్చే ఖరీఫ్‌కు 9 గంటల ఉచిత విద్యుత్ : మంత్రి బాలినేని - ఖరీఫ్ సీజన్​కు ఉచిత విద్యుత్

వచ్చే ఖరీఫ్‌కు 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధమని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్​రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం రైతుల కోరిక మేరకు పగలు, రాత్రి కరెంటు సరఫరా చేస్తామన్నారు. విద్యుత్ ఉద్యోగుల వేతనాల్లో కోత ప్రచారం అవాస్తవమని మంత్రి వెల్లడించారు.

Minister Balineni on 9hrs Power supply
చ్చే ఖరీఫ్‌కు 9 గంటల ఉచిత విద్యుత్

By

Published : Jun 14, 2021, 6:03 PM IST

వచ్చే ఖరీఫ్ సీజన్​కు పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్​ను అందిస్తామని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో రైతుల విజ్ఞప్తి మేరకు నాలుగున్నర గంటలు పగటిపూట, మరో నాలుగున్నర గంటలు రాత్రి పూట విద్యుత్ సరఫరా చేయనున్నట్లు వివరించారు. రూ. 1700 కోట్ల వ్యయంతో సబ్ స్టేషన్లు, ట్రాన్స్​ఫార్మర్లను ఏర్పాటు చేసిన తర్వాతే వంద శాతం 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నట్లు వెల్లడించారు.

విద్యుత్ ఉద్యోగుల వేతనాల్లో కోత ప్రచారం అవాస్తవమని మంత్రి వెల్లడించారు. పీఆర్‌సీ సూచనల మేరకే విద్యుత్ ఉద్యోగులకు వేతనాలు ఇస్తామన్నారు. 2018 పీఆర్సీనే 2022 వరకూ కొనసాగుతుందన్నారు. గతంలో 80 వేల కోట్ల మేర రుణ భారం విద్యుత్ కంపెనీలపై ఉందని.. క్రమంగా వాటిని తీర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కొవిడ్ సమయంలో 24 గంటలూ విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రత్యేకించి కొవిడ్ ఆస్పత్రుల వద్ద ఎక్కడా విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా సిబ్బందిని నియమించామన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించినా రైతులకు ఏమాత్రం భారం పడటం లేదన్నారు. డిస్కమ్​లను ప్రైవేటీకరించే ఆలోచన లేదన్నారు. జగనన్న కాలనీల్లోని చిన్న లే అవుట్లలో విద్యుత్ స్థంభాల ద్వారా..పెద్ద లే అవుట్లలో భూగర్భ డక్ట్​ల నుంచి కనెక్షన్లు ఇస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details