ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MINISTER AVANTHI : 'పర్యాటకుల్ని ఆకర్షించేందుకు ప్రత్యేక వేడుకలు నిర్వహించాలి' - minister avanthi srinivas conducting review

పర్యాటకరంగంపై మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. పర్యాటకుల్ని ఆకట్టుకునేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పర్యాటక హోటళ్లలో వంద శాతం ఆక్యుపెన్సీపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

మంత్రి అవంతి శ్రీనివాస్
మంత్రి అవంతి శ్రీనివాస్

By

Published : Oct 27, 2021, 3:34 AM IST

పర్యాటకుల్ని ఆకట్టుకునేలా రాష్ట్రంలో పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టనున్నట్టు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. సచివాలయంలో పర్యాటకరంగంపై సమీక్ష నిర్వహించిన మంత్రి.... పర్యాటకుల్ని ఆకర్షించేందుకు ప్రత్యేక వేడుకల్ని నిర్వహించాలని సూచించారు. వచ్చే4 నెలల్లో పర్యాటక హోటళ్లలో వంద శాతం ఆక్యుపెన్సీపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. కొత్త ఏడాదిలో టూరిజం యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. నవంబరు 6 నుంచి జిల్లా స్థాయిలో సీఎం కప్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. తెనాలి, బాపట్లలోని క్రీడా వికాస కేంద్రాలను నవంబర్ 1 తేదీ నుంచి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details