ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

WATER DISPUTES: తెలంగాణపై ఏపీ మంత్రిమండలి సీరియస్​

water disputes telugu states
minister anil

By

Published : Jun 30, 2021, 5:03 PM IST

Updated : Jun 30, 2021, 5:53 PM IST

15:20 June 30

కేటాయించిన జలాలకు లోబడే ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం: మంత్రి అనిల్‌

మంత్రి అనిల్‌

రాష్ట్రానికి కేటాయించిన జలాలకు లోబడే ప్రాజెక్టులు కట్టుకుంటున్నామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్(minister anil kumar yadav) స్పష్టం చేశారు. తక్కువ సమయంలో నీళ్లు తీసుకోవాలంటే సామర్థ్యం పెంచుకోక తప్పదన్నారు. తెలంగాణ తీరుపై ఇవాళే ప్రధానికి లేఖ(letter to pm) రాస్తున్నామని మంత్రి అనిల్‌ వెల్లడించారు. సాగునీటి అవసరాలు తీరాకే తెలంగాణ విద్యుదుత్పత్తి చేయాలన్న మంత్రి.. శ్రీశైలం జలాశయం(srisailam dam) నిండకూడదని తెలంగాణ భావిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

2 రాష్ట్రాల ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పగిద్దాం..

   దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్​రెడ్డి(YS rajashekharreddy) ని అవమానించేలా తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్నారని మంత్రి అనిల్ అన్నారు. వారి వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. మా సంయమనం చేతకానితనం కాదని మంత్రి అనిల్‌  స్పష్టం చేశారు. పాలమూరు, డిండి, నెట్టెంపాడు విస్తరణకు ఆమోదం లేదన్న మంత్రి.. పాలమూరు-రంగారెడ్డి కూడా అక్రమ ప్రాజెక్టేనని ఆరోపించారు. ఇష్టానుసారం విద్యుదుత్పత్తి చేసుకుంటే కేఆర్‌ఎంబీ(KRMB) ఉండటం ఎందుకు అని ప్రశ్నించారు. అవసరమైతే 2 రాష్ట్రాల ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగిద్దామని సవాల్ విసిరారు.  

తెలంగాణ మంత్రులకు రాజకీయ ప్రయోజనాలు ఉన్నా.. మాకు మాత్రం మా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. పొరుగు రాష్ట్రాలతో సంయమనం అనేది ముఖ్యమంత్రి జగన్ విధానం. రాయలసీమ ఎత్తిపోతల తనిఖీలో కేఆర్‌ఎంబీ బృందానికి సహకరిస్తున్నాం. కొవిడ్ వల్ల ప్రాజెక్టు తనిఖీకి కొంత వ్యవధి కోరాం. 

         మంత్రి అనిల్‌

మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ... రైతుల అవసరాల గురించి కూడా తెలంగాణ ఆలోచించట్లేదన్నారు. శ్రీశైలం డెడ్‌లైన్‌ నిల్వ నీటిని కరెంట్‌ పేరుతో వాడటం దుర్మార్గమన్నారు. చేసేపని తప్పా, ఒప్పా అని కూడా తెలంగాణ ఆలోచించట్లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రవర్తనను మంత్రి మండలి తీవ్రంగా పరిగణిస్తోందని తెలిపారు.

  మరో వైపు ఇవాళ జరిగిన మంత్రివర్గ భేటీ(cabinet meeting)లో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఉన్న మన రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తున్నానని, మన వాళ్లను ఇబ్బంది పెడతారనే తాను ఎక్కువగా మాట్లాడటం లేదని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాలని ప్రశ్నించారు. 

ఇవీచదవండి.

AP cabinet : తెలంగాణ మంత్రులు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు: సీఎం జగన్

WTC: టెస్టు ఛాంపియన్​షిప్​.. కొత్త పాయింట్ల విధానం!

Last Updated : Jun 30, 2021, 5:53 PM IST

ABOUT THE AUTHOR

...view details