ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ADIMULAPU SURESH: 'గడువులోగా విద్యాకానుక కిట్లు పంపిణీ చేయకపోతే జరిమానా'

By

Published : Aug 13, 2021, 10:03 PM IST

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందిస్తున్న విద్యాకానుక కిట్లను సమయానికి అందించని వారిపై చర్యలు ఉంటాయని మంత్రి ఆదిమూలపు సురేశ్​ తెలిపారు. ఈ విషయమై అధికారులతో మంత్రి సమీక్షించారు.

ADIMULAPU SURESH
ADIMULAPU SURESH

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న విద్యాకానుక సరఫరాలో ఆలస్యాన్ని సహించేది లేదని మంత్రి ఆదిమూలపు సురేశ్​ అధికారులకు స్పష్టం చేశారు. విద్యాకానుకలో భాగంగా ఇస్తున్న అన్ని వస్తువులు నూరుశాతం జిల్లాలకు చేరాలని.. వర్చువల్‌గా నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు.

గడువులోగా కిట్లు పంపిణీ చేయకపోతే తప్పనిసరిగా జరిమానా విధించనున్నట్లు మంత్రి అధికారులను హెచ్చరించారు. అదనంగా అందిస్తున్న నిఘంటువును సైతం కిట్​లో చేర్చి విద్యార్థులకు అందించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

ABOUT THE AUTHOR

...view details