మీటర్ల ఏర్పాటు వల్ల రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇచ్చేందుకు వీలుంటుందని మంత్రి పేర్ని నాని అన్నారు. ఇప్పటివరకు లక్ష అనధికార వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. అనధికార వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
రైతులకు 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. మీటర్ల ఏర్పాటుతో ఏ ఒక్క రైతుకూ నష్టం వాటిల్లదని.. పేర్ని నాని స్పష్టం చేశారు.