ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పర్యాటక ప్రాంతాల్లో భద్రతపై అధికారుల సమీక్ష' - ap tourism

శ్రీలంకలో ముష్కరుల దాడుల నేపథ్యంలో ఏపీ పర్యాటక శాఖ అప్రమత్తమైంది. విజయవాడలోని పలు పర్యాటక ప్రాంతాల్లోని నిఘా వ్యవస్థ, జాగ్రత్తలు, సెక్యూరిటీ వంటి అంశాలపై టూరిజం, పోలీసు అధికారులు సమీక్ష నిర్వహించారు

'పర్యాటక ప్రాంతాల్లో భద్రతపై అధికారుల సమీక్ష'

By

Published : May 13, 2019, 9:03 PM IST

'పర్యాటక ప్రాంతాల్లో భద్రతపై అధికారుల సమీక్ష'

విజయవాడ పున్నమి ఘాట్, బెరం పార్క్, భవానీ ద్వీపం వంటి పర్యాటక ప్రాంతాల్లో భద్రతపై అధికారులు సమీక్ష నిర్వహించారు. డీసీపీ ఉదయ రాణి, పర్యాటక శాఖ ప్రాంతీయ అధికారి హరినాధ్ బాబు ఆధ్వర్యంలో... టూరిజం శాఖ అధికారులు, స్ధానిక పోలీసులు సంయుక్తంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిఘా వ్యవస్ధ పటిష్ఠంపై చర్చించారు. శ్రీలంకలో జరిగిన ముష్కరుల దాడుల నేపథ్యంలో నగరంలోని వివిధ పర్యాటక ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో పాటు సెక్యూరిటీ వ్యవస్థను పటిష్ట పరచాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో పర్యాటక, పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details