ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

1957 నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు భారీ వరద - krishna floods

కృష్ణమ్మ శాంతిస్తుంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి నీటి ప్రవాహం తగ్గుతుంది. ఈనెల 14 నుంచి బ్యారేజీ అన్ని గేట్లు తెరిచి సముద్రంలోకి నీటిని వదులుతున్నారు. క్రమంగా ఎగువ నుంచి నీటి ప్రవాహం నెమ్మదిస్తుండడంతో... బ్యారేజీ వద్ద ఇప్పుడున్న జల దృశ్యం కనిపించకపోవచ్చు. బ్యారేజీ నిర్మించిన తరువాత ఇప్పటివరకు రెండుసార్లు భారీ వరదలు రాగా... ఇది మూడోది.

1957 నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు భారీ వరద

By

Published : Aug 19, 2019, 5:24 AM IST

1957 నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు భారీ వరద

ప్రకాశం బ్యారేజీ నిర్మించిన తరువాత 2సార్లు భారీగా వరదలు వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ స్థాయిని తలపించేలా కృష్ణమ్మ ప్రవాహం వచ్చింది. 1957 కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీని నిర్మించారు. దీనికి ముందు మరో ఆనకట్ట ఉండేది. దానికి కాలం చెల్లడంతో బ్యారేజీని నిర్మించారు. దీని సామర్థ్యం 3.07 టీఎంసీలు. నీటిమట్టం 12 అడుగులు. ఎగువన ఉన్న కట్టలేరు, మధిర, పాములేరు వాగుల నుంచి నీరు వచ్చినా... నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి ఇన్‌ఫ్లో వచ్చినా బ్యారేజీలో 12అడుగుల నీటిమట్టాన్ని నిర్వహించుకుంటూ... మిగిలిన నీటిని దిగువకు వదలేస్తున్నారు.

ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కృష్ణా జిల్లాతోపాటు పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందుతోంది. కృష్ణా జిల్లాకు తాగునీరూ అందుతోంది. ఈ 4జిల్లాల పరిధిలో 13లక్షల 8వేల 849ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. బ్యారేజీ నిర్మాణం తర్వాత తొలిసారిగా 1903 సంవత్సరంలో భారీ వరద వచ్చింది. అప్పుడు రోజుకు 10లక్షల 60వేల 830 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ సమయంలో బ్యారేజీ నీటిమట్టం 23.50 అడుగులుగా రికార్డయింది.

మళ్లీ 2009అక్టోబర్‌ 5న నాగార్జునసాగర్‌ నుంచి కృష్ణమ్మ ఉరకలేసుకుంటూ వచ్చింది. ఏకంగా 10లక్షల 94వేల 422 క్యూసెక్కుల నీరు బ్యారేజీ నుంచి సముద్రంలోకి వెళ్లింది. అప్పుడు బ్యారేజీ వద్ద 23.75 అడుగుల గరిష్ఠ నీటిమట్టం నమోదైంది. ఆ తర్వాత పదేళ్లకు మళ్లీ ఈ ఏడాది ఆగస్టులో ఆ స్థాయిని తలపించేలా వరద వచ్చింది. 2రోజుల క్రితం ఇన్‌ఫ్లో ఒక్కసారిగా 8లక్షల క్యూసెక్కులకు చేరడంతో... 2009 నాటి స్థాయిలో వరద వస్తుందని బ్యారేజీ నిర్వహణ అధికారులు భావించారు. దానికి తగ్గట్టుగానే ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

ఆదివారం ఉదయం ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద ప్రవాహం 6.26 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లోకి ప్రవాహం తగ్గిన నేపథ్యంలో... ఆదివారం నుంచి ప్రకాశం బ్యారేజీకి ప్రవాహం తగ్గింది. పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో... కృష్ణా నదిలో ఎగువన వరద క్రమేణా తగ్గుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 12అడుగుల నీటిమట్టం ఉండగా... 3.07 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ఇదీ చదవండీ...

కందిపప్పు కోసం రెవెన్యూ అధికారి కక్కుర్తి

ABOUT THE AUTHOR

...view details