యాదాద్రి ఆలయం పునః ప్రారంభం (Yadadri Temple Reopening) ఎప్పుడెప్పుడా అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ యాదాద్రిలో పర్యటించిన తెలంగాణ సీఎం కేసీఆర్ (Cm Kcr Yadadri Tour) మహూర్తం తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ (Mahakumbha Samprokshana) ఉంటుందని సీఎం తెలిపారు. మహాకుంభ సంప్రోక్షణ కోసం వివిధ పీఠాలకు ఆహ్వానం పంపనున్నట్టు చెప్పారు. మహాకుంభ సంప్రోక్షణకు 8 రోజుల ముందు మహా సుదర్శనయాగం ఉంటుందని సీఎం వివరించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించిన అనంతరం యాదాద్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. సమైక్య పాలకుల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురైందన్నారు.
‘‘సమైక్య పాలనలో ఆధ్యాత్మిక అంశంలో కూడా నిరాదరణ జరిగింది. గతంలో పుష్కరాలు కూడా తెలంగాణలో నిర్వహించలేదు. ఉద్యమ సమయంలో గోదావరి పుష్కర శోభ ప్రపంచానికి తెలియజేశాం. ఆధ్యాత్మిక సంపద ఉన్న ప్రాంతం తెలంగాణ. జోగులాంబ అమ్మవారి శక్తిపీఠానికి గతంలో ప్రాచుర్యం కల్పించలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రాచుర్యంలోకి తెచ్చాం. యాదాద్రి అభివృద్ధికి నాలుగైదేళ్ల క్రితం బీజం వేశాం. మహోత్కష్టమైన ఆలయాల్లో ప్రముఖమైనది యాదాద్రి. యాదాద్రి వైభవం నలుదిక్కులా చాటేందుకు పునర్నిర్మాణం చేపట్టాం. చినజీయర్ స్వామి సూచనలతో అభివృద్ధి పనులు జరిగాయి. చినజీయర్‌స్వామి లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆయన సూచనలతో సిద్ధాంతులు, వాస్తు నిపుణులతో చర్చలు జరిపి పునర్నిర్మాణం చేశాం. అంతర్జాతీయ ప్రమాణాలతో టెంపుల్ సిటీ (Temple City) నిర్మాణం జరిగింది’’ అని సీఎం వివరించారు.
125 కిలోల బంగారంతో విమాన గోపురం..