ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మరో అల్పపీడనం..రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో వర్షాలు

ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాగల 48 గంటల్లో ఏపీ తీరప్రాంతాలు, యానాంలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

మరో అల్పపీడనం..రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో వర్షాలు
మరో అల్పపీడనం..రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో వర్షాలు

By

Published : Sep 20, 2020, 5:48 PM IST

ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతవరణ శాఖ వెల్లడించింది. రాగల 24 గంటల్లో వాయవ్య బంగాళాఖాతం, పరిసరాల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. వచ్చే 48 గంటల్లో ఏపీ తీరప్రాంతాలు, యానాంలో వర్షలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. రానున్న 48 గంటల పాటు జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details