ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధానులను మార్చే అధికారం.. రాష్ట్ర ప్రభుత్వానికి లేదు: జేపీ - జేపీ

LSP JAYAPRAKASH : రాజధానులను మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని లోక్​సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్​ నారాయణ అన్నారు. తుగ్లక్​ కూడా తరచూ రాజధానులను మార్చారని.. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞత ప్రదర్శిస్తే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని హితవు పలికారు.

LOKSATTA JAYAPRAKASH
LOKSATTA JAYAPRAKASH

By

Published : Oct 16, 2022, 4:35 PM IST

LOKSATTA JAYAPRAKASH : అమరావతినే ఏకైక రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది చేయాలని లోక్​సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. రాజధానిపై ప్రభుత్వం తికమక చేసిందన్న ఆయన.. రాజధానులను మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. రాజధానిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని.. ఇప్పటికైనా హైకోర్టు తీర్పును గౌరవించి అమలు చేయాలన్నారు.

తుగ్లక్​ కూడా తరచూ రాజధానులను మార్చారని.. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞత ప్రదర్శిస్తే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని.. లేదంటే ఆర్థిక అభివృద్ధిలో వెనుకబడి కన్నీళ్లు కారుస్తూనే ఉండిపోవాల్సి వస్తుందన్నారు. అందరూ కలసి గతంలో అమరావతిని రాజధానిగా నిర్ణయించారని.. రైతులకు, ప్రజలకు, ప్రభుత్వానికి అభివృద్ది ఫలాలు అందేలా గతంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు సేకరించారన్నారు.

రాజధానులను మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు

పార్టీలు దారి తప్పితే ఖబడ్డార్: విజయవాడలో లోక్​సత్తా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అధినేత జయప్రకాశ్ నారాయణ పాల్గొన్నారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని.. మారాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులు పెరగడంపై జేపీ ఆందోళన వ్యక్తం చేశారు. రేపటి భవిష్యత్తు కోసం పునాదులు వేయాలని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పణంగా పెట్టి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ముందుచూపు లేకుండా ప్రభుత్వం, రాజకీయ పార్టీలు వ్యవహరించడం సరైంది కాదన్నారు. పార్టీలు దారి తప్పితే ఖబడ్డార్​ అని హెచ్చరించారు.

అభివృద్ధిని విస్మరించవద్దు : పేదలకు సంక్షేమం అమలు చేయాలి కానీ.. సంక్షేమం ఒక్కటే అమలు చేయకూడదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం వంకతో అభివృద్ధిని విస్మరించవద్దని హితవు పలికారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాలు పెరిగాయని ప్రభుత్వం చెబుతోన్న మాటలు అబద్ధమన్నారు. తాను ఇంగ్లీష్​కు వ్యతిరేకం కాదు..కానీ పిల్లలకు సులువుగా అర్థమయ్యే మాతృభాషలో బోధన చేయాలనేదే నా విధానమన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details