ఇండియన్ పెట్రోల్ లీగ్‌లో దక్షిణాదిలోనే సీఎం జగన్ నెంబర్ వన్‌గా నిలిచారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. 101.61 రూపాయలతో జగన్ నాటౌట్‌గా నిలిచారంటూ ఓ ఫోటోను ట్వీట్టర్లో ఉంచారు. విధ్వంసం, విద్వేషం రెండు కళ్లుగా సాగుతున్న వైకాపా రెండేళ్ల పాలనలో ధరలు రెండింతలు పెరిగాయని మండిపడ్డారు.
ప్రభుత్వ పనులకు అదనంగా జగన్ ట్యాక్స్ తోడై అన్ని రేట్లూ పెరిగాయన్న లోకేశ్.. బాదుడు రెడ్డి దెబ్బకి పెట్రోల్ ధర ఏపీలో శుక్రవారం సెంచరీ దాటి నాటౌట్‌గా రికార్డులు సృష్టించిందన్నారు. అభివృద్ధిలో అట్టడుగు స్థానం, కొవిడ్ కేసుల్లో 5వ స్థానానికి ఏపీని చేర్చి, పెట్రోల్ ధరల పెంపులో దక్షిణాదిలో నెంబర్‌వన్‌గా నిలిపారని విమర్శించారు. జగన్ రెడ్డి పాపం, ప్రజలకు శాపమని లోకేశ్ దుయ్యబట్టారు.