ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతన్న సర్వం కోల్పోయి పొలంలో కన్నీరు పెడుతున్నాడని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆవేదన చెందారు. ఇలాంటి సమయంలో.. ముఖ్యమంత్రి జగన్ మాత్రం రాజకీయాల్లో బిజీగా ఉన్నారని విమర్శించారు. లాక్ డౌన్ ఒక పక్క, అకాల వర్షాలు మరోపక్క రాష్ట్ర రైతాంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశాయని తెలిపారు.
గిట్టుబాటు ధర, కనీసం రవాణా సౌకర్యం లేక రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, పెసర, మిర్చి, అరటి, మామిడి,కొబ్బరి, నిమ్మ, ద్రాక్ష పంటలతో పాటు.. ఆక్వా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. తక్షణమే ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించడమే కాక.. ఆందోళనలో ఉన్న రైతాంగాన్ని యుద్ధప్రాతిపదికన ఆదుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.