విజయవాడలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. నగరంలో 21 ప్రాంతాల్లో కరోనా విజృంభిస్తున్నట్లు గుర్తించిన అధికారులు... 11 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. అలాగే ఆ 11 ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు విధించారు. కంటైన్మెంట్ జోన్లలో ఉదయం 6 నుంచి 11 వరకే దుకాణాలకు అనుమతి ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో రహదారుల్లో ఒకవైపు నుంచే రాకపోకలు జరపాలని స్పష్టం చేశారు.
విజయవాడలోని ఆ ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు - విజయవాడలో కంటైన్మెంట్ జోన్లు వార్తలు
విజయవాడలో కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు విధించారు అధికారులు. వాటిని కంటైన్మెంట్ ప్రాంతాలుగా ప్రకటించారు.
lockdown in vijayawada