New Presidents for YSRCP affiliate unions: వైకాపా అనుబంధ విభాగాలకు కొత్త అధ్యక్షుల్ని నియమిస్తూ.. అధికార పార్టీ కొత్త జాబితను విడుదల చేసింది. మంత్రి రోజా, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మరికొంత మందికి ఈ జాబితాలో అవకాశం దక్కలేదు. మహిళా విభాగం బాధ్యత నుంచి రోజాను తప్పించి.. గతేడాది తెదేపా నుంచి.. వైకాపాలో చేరి తిరిగి ఎమ్మెల్సీగా ఎన్నికైన పోతుల సునీతకు అప్పగించారు. యువజన విభాగం అధ్యక్ష బాధ్యత నుంచి రాజాను తొలగించి.. శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధారెడ్డికి ఇచ్చారు.
ఎస్టీ విభాగాన్ని.. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నుంచి తీసేశారు. ఈ విభాగాన్ని కొండప్రాంతం, మైదాన ప్రాంతమని రెండుగా చేసి వెంకటలక్ష్మి, ఎం.హనుమంత నాయకులకు అప్పగించారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ప్రసాదరాజును తొలగించి ఆ పదవిని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు ఇచ్చారు.