ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

LIGER లైగర్ కుటుంబ కథాచిత్రమన్న దర్శకుడు పూరీ

LIGER MOVIE లైగర్ కుటుంబ కథాచిత్రమని దర్శకుడు పూరీ జగన్నాథ్​ తెలిపారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చూడదగినదని పేర్కొన్నారు. విజయవాడ నొవాటెల్​లో సినిమా ప్రీ రిలీజ ఈవెంట్​లో చిత్ర బృందం పాల్గొన్నారు.

LIGER PRESS MEET
LIGER PRESS MEET

By

Published : Aug 21, 2022, 2:11 PM IST

LIGER PRESS MEET 'లైగర్' సినిమా కుటుంబ కథాచిత్రమని దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అన్నారు. తల్లీ, చెల్లీ, సోదరుడి మధ్య ప్రేమ, ఆప్యాయతలను ఈ చిత్రంలో చూపించామన్నారు. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి చూడదగ్గ మూవీ లైగర్ అని.. ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో లైగర్ సినిమాకి మంచి ఆదరణ లభిస్తుందని చిత్ర నిర్మాత ఛార్మీ అన్నారు.

పూరీ జగన్నాథ్‌ గారు చెప్పిన వెంటనే దీనిని చేయడానికి ఒప్పుకున్నానని.. ఈ సినిమా తనకు సంతృప్తినిచ్చిందని హీరో విజయ్​ దేవరకొండ తెలిపారు. కథకు అనుగుణంగా మారడానికి జిమ్​లో కసరత్తు చేశానన్నారు. ప్రేక్షకులు సినిమాని ఆదరించాలని కోరారు. ఈ సినిమా తనకు ఎంతగానో సంతృప్తి ఇచ్చిందని హీరోయిన్ అనన్యాపాండే తెలిపారు. ఈ అవకాశాన్ని కల్పించిన పూరీ, ఛార్మీలకు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ నొవోటల్ లో జరిగిన కార్యక్రమంలో వీరు మాట్లాడారు.

పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్​, టీజర్స్​, ట్రైలర్ విడుదలై యూత్​ను బాగా ఆకట్టుకున్నాయి. ఇందులో విజయ్‌ దేవరకొండ‌ యాక్షన్​ సీక్వెన్స్​, స్టంట్స్‌, దిగ్గజ బాక్సర్‌ మైక్‌టైసన్‌తో బాక్సింగ్‌ సన్నివేశాలు, హీరోయిన్​ అనన్య పాండే రొమాన్స్‌.. ఇలా ప్రతీది ​ సినిమాపై ఓ రేంజ్​లో ఎక్స్​పెట్టేషన్స్​ను పెంచేశాయి. పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. అనన్య పాండే కథానాయిక. ఆగస్టు 25న విడుదల కానుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details