ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 18, 2020, 5:02 PM IST

ETV Bharat / city

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ కోరారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లఘింస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు.

krishna district  collector urges people for dont get out from the house over lock down
krishna district collector urges people for dont get out from the house over lock down

కృష్ణా జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, విజయవాడ నగర పోలీసు కమిషనర్ తిరుమలరావు కోరారు. ఎట్టి పరిస్థితుల్లో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించొద్దని విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ అమలు తీరుపై... విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఇరువురూ సమీక్షించారు. నగరంలో 18 ప్రాంతాలను కంటైన్​మెంట్ జోన్​లుగా గుర్తించామన్నారు. ప్రజలను బయటిరాకుండా కట్టుదిట్టమైన చర్యలను చేపడుతున్నట్టు చెప్పారు. అయినా... కొన్నిచోట్ల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని అసంతృప్తి చెందారు. అకారణంగా వాహనాలతో బయటికొస్తే వెంటనే జప్తు చేస్తామని.. క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details